News February 6, 2025
రాజమండ్రి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

రాజమండ్రిలోని బొమ్మూరులో ఓ ఇంట్లో వ్యవభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. వడ్డివీరభద్రనగర్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటిపై ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ సిబ్బందితో కలిసి దాడిచేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వెంకటలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశామన్నారు. ఒక బాధిత మహిళను విడిపించామన్నారు.
దీనిపై కేసు నమోదైంది.
Similar News
News December 15, 2025
‘AGRATE’ ఏం చేస్తుంది?

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.
News December 15, 2025
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

<
News December 15, 2025
GNT: డ్రగ్స్ ముఠా కోసం గాలింపు.. ముగ్గురు అరెస్ట్

ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి డ్రగ్స్ అలవాటు చేసిన ముఠాను పట్టుకోవడానికి లాలాపేట పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ ముగ్గురి రక్త నమూనాలను కూడా పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.


