News April 12, 2025
రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేసిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. మాధవ్‌తో పాటు మరో ఆరుగురిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మాధవ్ అతనిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే.
Similar News
News January 1, 2026
వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

వాట్సాప్‌లో వచ్చే గుర్తుతెలియని ఏపీకే (APK) ఫైల్స్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా గురువారం సూచించారు. అమలాపురం నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అవగాహనతో ఉండాలన్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించారు.
News January 1, 2026
సంజీవని నిధికి రూ.8.22 లక్షల స్వచ్ఛంద విరాళాలు

నూతన సంవత్సరం సందర్భంగా “సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి”కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చేసిన విజ్ఞప్తికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. వివిధ ప్రభుత్వ శాఖలు,ఉ ద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనేక విభాగాలు, అధికారులు, ఉద్యోగులు, సంఘాలు, వ్యక్తుల స్వచ్ఛందంగా మొత్తం మీద రూ.8,22,292 విరాళాలుగా అందినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News January 1, 2026
కల్వకుర్తి ఐటీఐలో ఫ్రీగా ప్రింటింగ్ ఆపరేటర్ కోర్సు

కల్వకుర్తి ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ కళాశాలలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY4.0)పథకం కింద ప్రింటింగ్ ఆపరేటర్ షార్ట్ టర్మ్ కోర్సును అందిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు 18 ఏళ్లు నిండిన వారు ఈ కోర్సుకు అర్హులు. జనవరి 5, 2026న కోర్సు ప్రారంభం కానుంది. ఆసక్తి గలవారు జనవరి 3వ తేదీలోపు ఎస్ఎస్సీ, ఆధార్ కార్డు ధ్రువపత్రాలతో కల్వకుర్తి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవచ్చు.


