News April 13, 2025
రాజమండ్రి: స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను అభినందించిన డీఐజీ

ప్రవీణ్ కుమార్ పగడాల కేసు ఛేదించేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో ఎంతో ప్రతిభ చాటిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని DIG అశోక్ కుమార్ అభినందించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం అనంతరం SIT టీంను డీఐజీ, ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా సన్మానించారు. సుమారు 400కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి కేసును కొలిక్కి తేవడంలో SIT అద్భుత ప్రతిభ చాటిందని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు.
Similar News
News April 17, 2025
రాజమండ్రి: తల్లిదండ్రులు ఒక్కటవ్వాలని కుమార్తె సూసైడ్

చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కలిసి ఉండటం చూడలేదు. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులు దూరంగా ఉండటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తన మరణంతోనైనా ఒక్కటిగా ఉండాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. జంగారెడ్డిగూడెంకు చెందిన లేఖశ్రీ 3 ఏళ్ల వయసు నుంచే అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి రవి, తల్లి నాగదుర్గాదేవి రాజమండ్రిలో వేరుగా ఉంటున్నారు. దీంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది.
News April 17, 2025
రిమాండ్ పొడిగింపు.. రాజమండ్రి జైలుకి అనిల్

వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగిస్తూ నరసారావుపేటలోని రెండో అదనపు న్యాయాధికారి గాయ్రతి ఉత్తర్వులు ఇవ్వడంతో అతడిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. సీఎం, Dy.CM, లోకేశ్‌లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈనెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
News April 17, 2025
రాజమండ్రి: గోదావరిలో పడి మహిళ మృతి

రాజమండ్రిలోని మార్కండేశ్వర స్వామి గుడి సమీపంలో గోదావరిలో మునిగి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన నారాయణమ్మ రాజమండ్రిలోని ఓంశాంతి ఆశ్రమానికి వచ్చి వెళుతుంటుంది. ఈ విధంగా అక్కడికి వచ్చి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి చనిపోయి ఉంటుందన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.