News April 13, 2025
రాజమండ్రి: స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను అభినందించిన డీఐజీ

ప్రవీణ్ కుమార్ పగడాల కేసు ఛేదించేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో ఎంతో ప్రతిభ చాటిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని DIG అశోక్ కుమార్ అభినందించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం అనంతరం SIT టీంను డీఐజీ, ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా సన్మానించారు. సుమారు 400కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి కేసును కొలిక్కి తేవడంలో SIT అద్భుత ప్రతిభ చాటిందని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు.
Similar News
News April 15, 2025
లా కమిషన్ ఛైర్మన్‌గా దినేశ్ మహేశ్వరి

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి 23వ లా కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హితేశ్ జైన్, DP వర్మను సభ్యులుగా నియమించింది. 2027 ఆగస్టు 31వరకు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు.
News April 15, 2025
నిబద్ధతతో పని చేయాలి: MHBD ఎస్పీ

పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే నిబద్ధతతో పని చేయాలని MHBD ఎస్పీ రామ్నాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్‌లో కోర్టు డ్యూటీ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. కోర్టు డ్యూటీలో నిర్లక్ష్యం వహించకూడదని, కేసు ఛార్జి షీట్లను నిర్దేశిత కాలంలో న్యాయస్థానాలకు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News April 15, 2025
డబ్బులేక రోడ్డు పక్కనే పడుకునేవాడిని: షారుఖ్

కెరీర్ తొలినాళ్లలో ముంబైలో అద్దె కట్టేందుకు కూడా డబ్బు లేక రోడ్డు పక్కన పడుకునేవాడినని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మనిషికి ఇల్లు, చదువు ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్లే. ఉద్యోగం, డబ్బు లేకపోయినా ఫర్వాలేదు కానీ నిద్రపోవడానికి, బాధగా ఉన్నప్పుడు కూర్చుని ఏడవడానికి ఓ నీడ కచ్చితంగా ఉండాలి. నా పిల్లలకు నా పరిస్థితి ఉండకూడదని ముందుగానే ఇల్లు కట్టుకున్నాను’ అని తెలిపారు.