News January 4, 2025

రాజమండ్రికి మెగాస్టార్ చిరంజీవి..?

image

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ‘గేమ్ ఛేంజ‌ర్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇవాళ రాజమండ్రిలో గ్రాండ్‌గా జరగనుంది. చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా కుటుంబం అంతా ఒకే వేదికపై కనిపిస్తుందనే జోష్ అభిమానుల్లో నెలకొంది. సా.6 గంటలకు వేమగిరి జాతీయ రహదారి పక్కనున్న లేఅవుట్‌లో ఈవెంట్ ప్రారంభం కానుంది.

Similar News

News January 8, 2025

యూరియా కొరత లేకుండా చూడాలి: మంత్రి కందుల

image

తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎరువులను సరఫరా చేయాలని సూచించినట్లు తెలిపారు. జనవరి 10వ తేదీ లోపు 2500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

News January 7, 2025

అక్రమ సంబంధమే హత్యకు దారితీసింది: డీఎస్పీ ప్రసాద్

image

కె.గంగవరం (M) కూళ్ళలో జరిగిన యువకుడి హత్య అక్రమ సంబంధం కారణంగా జరిగిందని రామచంద్రపురం ఇన్‌ఛార్జ్ డీఎస్పీ డీఆర్‌కె‌ఎస్. ప్రసాద్ తెలిపారు. ఆయన మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడు, మృతి చెందిన వ్యక్తి మంచి మిత్రులని.. మృతి చెందిన సత్తి సువర్ణ రత్నం తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెంకట సూర్య చంద్ర అనుమానించి హత్య చేసినట్లు పేర్కొన్నారు.

News January 7, 2025

కే.గంగవరం మండలంలో హత్య

image

కే.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూళ్ల గ్రామంలో సోమవారం రాత్రి సత్తి సువర్ణ రత్నం (35)ని అదే గ్రామానికి చెందిన మంచాల వెంకట సూర్య చంద్ర వివాహేతర సంబంధం కారణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.