News March 26, 2025

రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం

image

హైదరాబాద్‌కి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల <<15882715>>మృతదేహానికి <<>>పోస్టుమార్టం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ బందోబస్తు నడుమ బుధవారం నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు సమక్షంలో వీడియో పర్యవేక్షణలో వైద్యులు పోస్టుమార్టం చేస్తున్నారు. ఇప్పటికే అధిక సంఖ్యలో క్రైస్తవ పెద్దలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News April 1, 2025

దుర్గి: పెన్షన్‌ పంపిణీ చేసిన కలెక్టర్  

image

దుర్గి మండలంలో సామాజిక పెన్షన్‌ను కలెక్టర్ అరుణ్ బాబు స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక పెన్షన్ పంపిణిలో భాగంగా దుర్గి మండల కేంద్రంలో పెన్షన్‌లను కలెక్టర్ అరుణ్ బాబు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నెల సక్రమంగా పెన్షన్సకాలంలో అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు.  

News April 1, 2025

కర్నూలు: పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

image

పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య, స్మారక మున్సిపల్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.

News April 1, 2025

‘విశాఖలో చంపి సాలూరులో వేలాడదీశారు’

image

సాలూరు మండలంలో గత నెల జరగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. సాలూరు మండలానికి చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. రాంబాబు యువతిని ఆరిలోవలోని ఓ రూములో చంపి ఫ్రెండ్స్ సాయంతో బైక్‌పై తీసుకెళ్లి సాలూరులోని జీడితోటలో చెట్టుకు చున్నీతో ఉరి వేసి ఆత్మహత్యలా చిత్రీరించాడు.

error: Content is protected !!