News June 8, 2024

రాజముద్రపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: మంత్రి కొండా

image

తెలంగాణ అధికారిక రాజముద్రపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాజముద్రలో కీర్తి తోరణం తొలగించలేదని, అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని, కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

Similar News

News October 3, 2024

జనసంద్రమైన వేయి స్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలు

image

HNK జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల సందర్భంగా వేయి స్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. హనుమకొండ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు.

News October 3, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> BHPL: రంగయ్యపల్లిలో పిడుగు పడి మహిళా రైతు మృతి
> MHBD: గుట్టకింది తండాలో పిడుగు పడి ఒకరికి గాయాలు
> HNK: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
> KZP: సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు
> HNK: పిడుగు పడి ఇద్దరు మృతి
> JN: కే-వీల్స్ దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్
> MHBD: దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు
> HNK: మహిళతో సహా ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్
> WGL: బాధితుడికి పోగొట్టుకున్న ఫోన్ అందజేత

News October 2, 2024

బతుకమ్మను ఎత్తుకున్న ఎంపీ కడియం కావ్య

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. బతుకమ్మను ఎంపీ కడియం కావ్య ఎత్తుకొని కాసేపు బతుకమ్మ ఆడి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, బతుకమ్మ పండుగ వేడుకల్లో తొలిసారి ఎంపీగా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.