News December 22, 2024

రాజవొమ్మంగి: చుక్కల జింక మాంసం స్వాధీనం

image

రాజవొమ్మంగి మండలం ముంజవరప్పాడు గ్రామంలో చుక్కల జింక మాంసం స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులపై వన్యప్రాణుల చట్టం-1972 కింద కేసు నమోదు చేసామని అటవీ శాఖ అధికారి రాము ఆదివారం మీడియాకు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. అడవి జంతువుల వేటాడితే కఠిన చర్యలు తప్పవని రాజవొమ్మంగి రేంజ్ అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

Similar News

News December 23, 2024

అమలాపురం: నేడు యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌ సోమవారం ఉదయం 10.గంటల నుంచి యధావిధిగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ గోదావరి భవన్‌లో జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితో పాటు డివిజన్, మండల స్థాయిలో గ్రీవెన్స్‌ జరుగుతుందన్నారు.

News December 22, 2024

నోరూరించే గోదావరి వంటకాలు..

image

గోదావరి జిల్లాలు అంటేనే నోరూరించే వంటకాలకు ఫేమస్. అందులోనూ సంక్రాంతి వచ్చేస్తోంది. దీంతో ఆత్రేయపురం పూతరేకులు, మందపల్లి నేతి బొబ్బట్లు, రాజమండ్రి పాలకోవా, బెండపూడి బెల్లంజీళ్లు, రావులపాలెం కుండబిర్యానీ, కాకినాడ గొట్టంకాజా, కత్తిపూడి కరకజ్జం, ముక్కామల పప్పు చెక్కలు, మండపేట గవ్వలు, కోనసీమ నగరం గరాజీలకు ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. మరి మన గోదావరి వంటకాల్లో మీకు బాగా నచ్చిన వంటకం ఏదో కామెంట్ చేయండి.

News December 22, 2024

యూ.కొత్తపల్లి: బీరువా మీద పడి చిన్నారి మృతి

image

యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని ఫుల్ గాస్పల్ చర్చ్‌లో పాస్టర్‌గా ఉన్న రాజబాబు మనుమరాలు జయకేతన అనే రెండేళ్ల చిన్నారి క్రిస్మస్ వేడుకలకు తన తల్లి రత్న ప్రకాశ్‌తో కలిసి తాతయ్య ఇంటికి వచ్చింది. అయితే ఇల్లు శుభ్రపరుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బీరువా చిన్నారిపై పడింది. దీంతో కొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.