News April 29, 2024

రాజాo: 78 మంది అరెస్ట్

image

ఈ ఏడాది జనవరి 1 నుంచి 28 వరకూ 252.99 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు రాజాం సెబ్ సీఐ బి. శ్రీధర్ వెల్లడించారు. 70 కేసులు నమోదు చేసి 78 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. 2,700 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేసి మూడు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 120 మందిని బైండోవర్ చేయడంతోపాటు 9 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News December 21, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

✩శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా పల్స్ పోలియో
✩జలమూరు: మా రెండు గ్రామాలను పంచాయతీగా ఏర్పాటు చేయాలి
✩ఆమదాలవలస: పుష్కరిణిలో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి
✩నియోజకవర్గ అభివృద్ధి నా ఎజెండా: ఎమ్మెల్యే అశోక్
✩పలాసలో రక్తదానం చేసిన మాజీ మంత్రి సీదిరి
✩ గొప్పిలిలో వరి కుప్ప దగ్ధం
✩లావేరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
✩ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

News December 21, 2025

ఇటుకల బట్టీలు వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేసిన Dy DMHO

image

పలాస మండలం బుడంబో కాలనీ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలను డిప్యూటీ డీఎంఎం‌హెచ్ ఓ మేరీ కేథరిన్ వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో పోలియో వ్యాది బారిన పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.

News December 21, 2025

SKLM: ‘చిన్నారులకు పోలియో రక్షణ కవచం’

image

జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఎచ్చెర్లలోని పూడివలసలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 1,55,876 మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.