News February 13, 2025

రాజాపేట: ఉరేసుకొని యువకుడి సూసైడ్

image

ఉరేసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రాజాపేట మండలంలో జరిగింది. SI అనిల్ కుమార్ తెలిపిన వివరాలు.. రఘునాథపురానికి చెందిన బిట్ల రమేశ్ పెద్ద కుమారుడు పవన్(25) గురువారం ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఘటనాస్థలానిక చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 14, 2025

విజయవాడ: పోలీసులు కీలక ప్రకటన

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, పబ్లిక్ పరీక్షల దృష్ట్యా నేటి నుంచి ఏప్రిల్ 3వరకు సెక్షన్ 163 కింద ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. నగర పరిధిలో ఎక్కవ మంది గుమికూడవద్దన్నారు. కర్రలు, రాళ్లు, మారణాయుధాలు పట్టుకుని తిరగొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 14, 2025

ఒంగోలు: వీడియో కాన్ఫరెన్స్‌లో మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత మొదటిసారి ముఖ్య నాయకులు, అభిమానులతో మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. వారంతా ఎంపీ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ఒంగోలుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఘన శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

News February 14, 2025

వనపర్తి: అక్రమ ఇసుక డంపులను సీజ్ చేసిన అడిషనల్ కలెక్టర్

image

పెబ్బేరు మండల పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వచేసిన 400 ట్రాక్టర్ల అక్రమ ఇసుక డంపులను అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేసి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేయడం కానీ, అక్రమ రవాణా చేసిన కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజన్ అధికారి, సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ లక్ష్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాఘవేందర్రావు రావు ఉన్నారు.

error: Content is protected !!