News April 16, 2025

రామగిరి ఎస్ఐని దూషించిన వారిపై కేసు

image

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో దూషించిన వారిపై కేసు నమోదైంది. ఈ నెల 13న సుధాకర్ చేసిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టనున్నారు.

Similar News

News April 16, 2025

సమ్మర్‌ సెలవుల్లో ఈప్రాంతాలు చూసొద్దాం రండి

image

వేసవి సెలవులకు టూర్ ప్లాన్ చేసుకునే వారికి ఏలూరు జిల్లా స్వాగతం పలుకుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలు, గోదావరి అందాలు మనసులను కట్టిపడేస్తాయి. గుంటుపల్లి బౌద్దారామాలు, ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం, పాపికొండలు, కొల్లేరు సరస్సు, గుబ్బలమంగమ్మ క్షేత్రం, గురవాయిగూడెం మద్ది క్షేత్రం, ముంజులూరు వాటర్ పాల్స్ సందర్శించి ఆహ్లాదాన్ని పొందవచ్చు. సెలవుల్లో మీరేమైనా టూర్ ప్లాన్ చేసుకున్నారా కామెంట్ చేయండి

News April 16, 2025

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎంపీ

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని విజయనగరం, విశాఖ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, భరత్ కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం డిస్ట్రిక్ట్ ఎలక్ట్రసిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. పిఎం సూర్య ఘర్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ ఇంస్టాలేషన్ గ్రౌండ్ సోలార్ ప్లాంట్స్ ఎస్సి, ఎస్టి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అంబేడ్క‌ర్, అధికారులకు సూచించారు.

News April 16, 2025

15 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్, బంగ్లా చర్చలు

image

పాక్, బంగ్లా మధ్య 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు రేపు ఢాకాలో భేటీ కానున్నారు. వాణిజ్య, భద్రతాపరమైన అంశాలపై వారు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగ్లాకు తమ ఎగుమతుల్ని పెంచే ఆలోచనలో పాక్ ఉంది. అఫ్గాన్, ఇరాన్ నుంచి కూడా ఉత్పత్తుల్ని పాక్ ద్వారా బంగ్లాకు చేరవేయాలని ఆ దేశం భావిస్తున్నట్లు సమాచారం.

error: Content is protected !!