News February 1, 2025
రామగుండం: అధికారులతో సింగరేణి C&MD వీడియో కాన్ఫరెన్స్

రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో C&MDబలరాం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానించబడిన అటవీ భూమి మళ్లింపులు, పర్యావరణ క్లియరెన్స్ తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు గోపాల్ సింగ్, ఆంజనేయ ప్రసాద్, కుమార స్వామి, కర్ణ, వీరారెడ్డి తదితరులున్నారు.
Similar News
News March 6, 2025
ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్

ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ చిక్కుకున్నారు. ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ధర్మపురిలో ఎప్పటి నుంచో ఈ అవినీతి జరుగుతుందనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి.
News March 6, 2025
బిగ్‌బాస్ సీజన్-9కు కొత్త హోస్ట్?

టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో తొమ్మిదో సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని సమాచారం. ఎనిమిదో సీజన్‌కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ లేకపోవడంతో హోస్ట్‌గా ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ షోను ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.
News March 6, 2025
ప్రజలకు మెరుగైన సేవలందించాలి: KMR ఎస్పీ

జిల్లాలో పోలీసులు ప్రజలకు మరింత సేవలందించి చెరువ కావాలని KMR ఎస్పీ సింధుశర్మ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆమె పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష గురువారం నిర్వహించారు. పెండింగ్, అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.