News February 5, 2025
రామగుండం: పదవీకాలం ముగిసింది.. ఫోన్ నంబర్లు బ్లాక్
రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో అధికారికంగా ఇచ్చిన సెల్ ఫోన్లు మూగనోము పాటిస్తున్నాయి. 50 మంది కార్పొరేటర్లు, 5 కో-ఆప్షన్ సభ్యులు పదవీకాలం ముగియడంతో సంబంధిత అధికారులు ఈ నంబర్లను బ్లాక్ చేశారు. ఇప్పటికే సెల్ ఫోన్లను ఆఫీస్‌కు అప్పగించాల్సి ఉండగా యథావిధిగా ఉపయోగించుకుంటున్నారు. వీటికి సంబంధించి నెల నెల బిల్లులు చెల్లిస్తూ వచ్చింది.
Similar News
News February 5, 2025
జనగామ: నూతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేయాలి: కలెక్టర్
రఘునాథపల్లి మండలంలోని నిడిగొండలో కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కిసాన్ మేళా, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేయాలని అన్నారు.
News February 5, 2025
KNR: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక నామినేషన్
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఒక నామినేషన్ దాఖలు అయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ నామినేషన్ వేశారు. మొత్తంగా 05.02.2025 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు.
News February 5, 2025
దేశంలో నాన్‌వెజ్ బ్యాన్ చేయాలి: శత్రుఘ్న సిన్హా
దేశంలో మాంసాహారంపై నిషేధం విధించాలని సినీనటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. మన దేశంలో చాలా చోట్ల బీఫ్ బ్యాన్ చేశారని, అలానే నాన్‌వెజ్‌ను కూడా బ్యాన్ చేయాలన్నారు. నార్త్‌ఈస్ట్‌తోపాటు దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో గొడ్డు మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన యూసీసీ (యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని ఆయన ప్రశంసించారు.