News March 28, 2025
రామడుగు: శుక్రవారం సభ పరిష్కారాల వేదిక: కలెక్టర్

శుక్రవారం సభ ఒక పరిష్కారం లాంటిదని జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి అన్నారు. శుక్రవారం రామడుగు మండలంలోని కొక్కేరకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. శుక్రవారం సభ ద్వారా పలు సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎంపీడీవో రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 2, 2025
కేంద్ర స్పోర్ట్స్, యువజన వ్యవహారాల శాఖ మంత్రిని కలిసిన SU Vc

ఆచార్య రవికుమార్ రిజిస్ట్రార్, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌తో కేంద్ర స్పోర్ట్స్, యువజన వ్యవహారాలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ SU Vc ఆచార్య ఉమేశ్‌కుమార్ కలిశారు. ఈ సందర్భంగా SUకి ఖేలో ఇండియా పథకం కింద మంజూరు చేసిన నిధులు త్వరగా అందించాలని కోరారు. దీంతో విశ్వవిద్యాలయంలోని క్రీడలకు సంబంధించిన మల్టీపర్పస్ భవనాన్ని నిర్మించుకోవడానికి సరైన ఆర్థిక సహకారం లభిస్తుందన్నారు.
News April 1, 2025
ఇల్లందకుంట రామాలయం బ్రహ్మోత్సవాలు, జాతర వివరాలు

అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగుతాయని ఈవో సుధాకర్ తెలిపారు. ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7న పట్టాభిషేకం,12న సూర్య రథోత్సవం( బండ్లు తిరుగుట)13, 14న చంద్ర రథోత్సవం(పెద్దరథం),15న శ్రీ పుష్పయాగం, 16న ఏకాంత సేవలు స్వామివారికి జరుపుతామన్నారు. భక్తులకు వైద్య, విద్యుత్, నీటి ఏర్పాట్లు చేశారు.
News March 31, 2025
KNR: డిప్యూటీ కలెక్టర్‌కు ఎంపికైన హరిణి

కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కన్నం హరిణి గ్రూప్-1లో 499.5మార్కులతో స్టేట్ 55వ ర్యాంక్ సాధించి, డిప్యూటీ కలెక్టర్‌కు సెలెక్ట్ అయ్యారు. హరిణి తల్లిదండ్రులు రమేష్, కళా ప్రపూర్ణ జ్యోతి ప్రభుత్వ టీచర్లు. విద్యానగర్లోనే ప్రాథమిక విద్యాను అభ్యసించిన హరిణి ఇంజనీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అనంతరం ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు.