News December 28, 2024

రామతీర్థంలో ఘనంగా సహస్ర దీపాలంకరణ సేవ

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలోని ఊయలలో స్వామివారి విగ్రహం వేంచేపుచేసి సుందరంగా అలంకరించారు. వెయ్యి దీపాలు వెలిగించారు. స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Similar News

News December 29, 2024

VZM: నకిలీ ఐపీఎస్ ఉన్నత విద్యావంతుడే..!

image

నకిలీ IPS సూర్య ప్రకాష్ ఉన్నత చదువులే చదివాడు. స్థానికంగా బీటెక్ పూర్తి చేసిన ఈయన కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో MBA చేశాడు. 2003లో ఇండియన్ ఆర్మీలో సిపాయిగా ఎంపికయ్యాడు. 2005లో ఉద్యోగం విడిచిపెట్టి 2016 వరకు కాంట్రాక్ట్ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. కాగా పవన్ పర్యటనలో IPS అంటూ తిరుగుతూ దిగిన ఫొటోలను వాట్సప్ స్టేటస్‌ పెట్టుకోగా ఎంక్వైరీలో అసలు విషయం బయట పడిందని పోలీసులు తెలిపారు.

News December 29, 2024

‘భోగాపురం ఎయిర్‌పోర్ట్ ద్వారా ఎగుమతులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలి’

image

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌య నిర్మాణాన్ని నిర్ణీత గ‌డువులోగా పూర్తిచేయాల‌ని 20 సూత్రాల కార్య‌క్ర‌మం ఛైర్మన్ లంకా దిన‌క‌ర్‌ సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఎయిర్ ఫోర్ట్ అంశాన్ని ప్రస్థావించారు. అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా స్థానిక యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ ఇచ్చి ఉపాధి క‌ల్పించేందుకు సిద్ధం చేయాల‌న్నారు.విమానాశ్ర‌యం ద్వారా ఎగుమతుల‌కు ఉన్న అవ‌కాశాల‌పై ఇప్పటినుంచే దృష్టిపెట్టాల‌న్నారు.

News December 28, 2024

VZM: ‘వైద్యాధికారులు బాధ్యతగా పని చేయాలి’

image

వైద్యాధికారులు గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితుల్ని తెలుసుకొని వాటికి తగ్గట్టుగా బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్యాధికారులతో సమీక్షించారు. గత మూడు నెలలుగా డయేరియా అంశం జిల్లాను పట్టి పీడిస్తోందని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా వాస్తవాలను వెల్లడించి నమ్మకం కలిగించాలని తెలిపారు.