News February 24, 2025
రామతీర్థంలో శివరాత్రికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరిగే శివరాత్రి జాతర ఉత్సవాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐ గణేశ్‌తో కలిసి రామతీర్థంలో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు. ఏర్పాట్లపై ఆలయ ఈఓ శ్రీనివాసరావుతో చర్చించారు.
Similar News
News December 14, 2025
విజయనగరం కలెక్టరేట్‌లో రేపు PGRS: కలెక్టర్

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు PGRS నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు పూర్వపు స్లిప్పులతో రావాలని సూచించారు. అర్జీల కోసం 1100 కాల్ సెంటర్, Meekosam.ap.gov.in సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
News December 13, 2025
ఈనెల 14 నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు: CMD

ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని శనివారం కోరారు. కళాశాల విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.
News December 13, 2025
కొంతమంది సీడీపీవోలు డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నారు: అశోక్

ఐసీడీఎస్ హైర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ సమావేశం శనివారం స్థానిక DRDA మీటింగ్ హాలులో జరిగింది. రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హాజరయ్యారు. కొంతమంది సీడీపీవోలు సొంత వాహనాలను ఉపయోగించి బిల్లులు డ్రా చేసుకుంటూ డ్రైవర్ల ఉపాధిపై దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.


