News February 24, 2025
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప దేవాలయాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రుద్రేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్న శివుడి ఆశీస్సులు భక్తులు పొందాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
Similar News
News February 24, 2025
నేడు మహబూబాబాద్‌లో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత

మహబూబాబాద్‌లో నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ఉదయం 9:30గం.కు డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లిలో నెట్ సెంటర్ ప్రారంభిస్తారు. 10:00 గం.కు మరిపెడలోని జాగృతి నాయకురాలు మాధవి గృహప్రవేశంలో పాల్గొని, 11:00 గం.కు కురవి వీరభద్రస్వామి ఆలయంలో పూజ చేస్తారు. మ.12:00 గంటలకు మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొంటారు.
News February 24, 2025
KNR: నేడు ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నేడు నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తియిన తర్వాత రావాలని తెలిపారు.
News February 24, 2025
పల్నాడు: కోటప్పకొండ జాతరకు రహదారులు సిద్ధం

నరసరావుపేటలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పురస్కరించుకొని జరిగే త్రికోటేశ్వరస్వామి జాతరకు రహదారులు సిద్ధమయ్యాయి. 10 రోజులుగా ప్రభుత్వ శాఖలు కొండకు వచ్చే రహదారులలో మరమ్మతులు చేపట్టాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, పెట్లూరు వారిపాలెం, జేఎన్టీయూ, పమిడిమర్రు, గురవాయపాలెం కాలువ కట్ట రోడ్లు, గిరి ప్రదక్షిణ మార్గాలు వాహనాల రాకపోకలకు అందుబాటులోకి వచ్చాయి.