News April 7, 2025
రామప్పలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల ప్రపంచ ప్రసిద్ధి చెంది యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఈనెల 14న మిస్ వరల్డ్ టీం సందర్శించనున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట రాష్ట్ర పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. మిస్ వరల్డ్ టీం ఆలయంతో పాటు, రామప్ప సరస్సు, కాటేజీలను సందర్శించనుంది.
Similar News
News April 17, 2025
సిటీలో పెరుగుతున్న నీటి వినియోగం

HYD మహానగరంలో నీటి వినియోగం ఏటా పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ నగరం విస్తరిస్తుండటం కూడా ఓ కారణం. 2021 మార్చిలో జలమండలి 75,782 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయగా, 2022 మార్చికి 83,078 ట్యాంకర్లకు పెరిగింది. 2023 మార్చిలో 1,12,679 ట్యాంకర్ల నీటిని సిటీ ప్రజలు ఉపయోగించగా 2024 మార్చి నాటికి ఆ సంఖ్య 1,69,596కు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 2,82,961 ట్యాంకర్ల సరఫరా జరిగింది.
News April 17, 2025
నారాయణపేట: ‘విజయవంతమైన కార్మికుల సమ్మె’

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక రోజు సమ్మె నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు నెలకు రూ.9,500 వేతనం ఇవ్వాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. జీవో 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. జీవో 61 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
News April 17, 2025
ఏటూరునాగారం: వడదెబ్బతో కూలీ మృతి

వడదెబ్బతో కూలీ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. 1వ వార్డుకు చెందిన వ్యవసాయ కూలీ పలిశెట్టి వెంకటేశ్వర్లు(62) ప్రతి రోజు సమీపంలోని పంట పొలాలు, మిర్చి కల్లాల వద్దకు పనులకు వెళ్లేవారు. బుధవారం రాత్రి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే వెంకటేశ్వర్లు మృతి చెందారు.