News April 4, 2025

రాములోరి కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ

image

ఈనెల 6, 7 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మంటపం, సెక్టార్లు, లడ్డూ, తలంబ్రాల కౌంటర్ వద్దకు సులభంగా వెళ్లేందుకు QR కోడ్, ఆన్‌లైన్ లింక్ రూపొందించినట్లు పేర్కొన్నారు.

Similar News

News April 18, 2025

సిట్ విచారణకు విజయసాయి హాజరు

image

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కాసేపటి కిందటే విజయవాడలోని సిట్ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో ఆయన అధికారులకు ఏం చెప్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ స్కామ్‌కు కసిరెడ్డి రాజశేఖరే కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో సాక్షిగా విచారించేందుకు ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది.

News April 18, 2025

విక్రమ్ ‘వీర ధీర శూర’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

image

కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానుందని తెలిపింది. అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా గత నెల 27న థియేటర్లలో విడుదలైంది.

News April 18, 2025

భీమవరం: వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు

image

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు చేసుకోవచ్చునని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి గల వివిధ క్రీడల జిల్లా అసోసియేషన్లు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు వారి దరఖాస్తులను 85000 64372కు అందజేయాలన్నారు.

error: Content is protected !!