News April 16, 2024

రాములోరి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పణ

image

భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి సగర వంశస్తులైన మంగళవారం పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, వడి బియ్యం స్వామివారికి అందజేశారు. భాగ్యనగరం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రతో తరలివచ్చిన ఆలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తామని చెప్పారు.

Similar News

News November 5, 2024

కొత్తగూడెం: ఫుడ్ డెలివరీ బాయ్ సూసైడ్ 

image

కొత్తగూడెం మున్సిపాలిటీ చిట్టిరామవరం తండాకు చెందిన అజ్మీర శివ(24) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. వ్యవసాయ పనుల నిమిత్తం వారి తల్లిదండ్రులు ఉదయం పొలాలకు వెళ్లిపోయారు. కాగా సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉరి వేసుకుని ఉన్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువకుడు కొత్తగూడెం టౌన్లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడని చెప్పారు.

News November 5, 2024

ఖమ్మం: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

image

మధిర-మోటమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని, మృతుడు మెరూన్ రంగు షర్ట్, నీలం జీన్స్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచినట్లు చెప్పారు. ఖమ్మం జి.ఆర్.పి.సి భాస్కర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 5, 2024

చింతకాని: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

image

చింతకాని మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రతిభను చాటుకున్నారు. డీఎస్సీ 2024లో ఈ కుటుంబానికి చెందిన ముగ్గురు సూపర్ సక్సెస్‌ సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జాబ్ కొట్టారు. ఈలప్రోలు కృష్ణారావు స్కూల్ అసిస్టెంట్‌గా, ఆయన సోదరుడు నరేష్, సోదరి సునీతలు ఎస్‌జీటీ పోస్టుల్లో సెలెక్ట్‌ అయ్యి విధుల్లో చేరారు. గ్రామస్థులు, బంధుమిత్రులు వారికి అభినందనలు తెలిపారు.