News February 12, 2025
రాయచోటి: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739283318213_52025345-normal-WIFI.webp)
భార్యను క్రూరంగా హత్యచేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ రాయచోటి 5వ అదనపు జిల్లా జడ్జి తీర్పిచ్చారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి ధనంజయ(31) తన భార్య లక్ష్మీదేవిని 2017 ఫిబ్రవరిలో హత్య చేశాడు. అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు. కోర్టు పూర్వాపరాలను విచారించింది. నేరం రుజువు కావడంతో ధనంజయకు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం జడ్జి కృష్ణన్ కుట్టి తీర్పునిచ్చారు.
Similar News
News February 12, 2025
ఇక్ష్వాకు వంశంపై హరగోపాల్ ఏమన్నారంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739349436481_746-normal-WIFI.webp)
ఇక్ష్వాకుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. పురాణాల ప్రకారం రాముడిది ఇక్ష్వాకు వంశం. అలాగే, తెలుగునాట కూడా ఈ పేరుతో ఓ రాజవంశం ఉండేది. శాతవాహనుల తరువాత పాలించింది ఆంధ్ర ఇక్ష్వాకులు. ‘ఏ కులం వారైనా ఇక్ష్వాకులు అని చెప్పడానికి ఏ ఆధారమూ లేదు. ఈ వంశం ఇప్పటి వరకూ కొనసాగి, ఎవరో ఒకరు ఇంకా ఉన్నారని చెప్పే అవకాశం లేదు. ఎవరైనా చెప్పుకున్నా దానికి సాక్ష్యం ఉండదు’ అని ప్రొఫెసర్ హరగోపాల్ చెబుతున్నారు.
News February 12, 2025
జేఈఈ మెయిన్స్‌లో గుండాల విద్యార్థుల ప్రతిభ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739340847372_51259851-normal-WIFI.webp)
ఎన్.టి.ఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్-2025 తొలి సెషన్ ఫలితాల్లో మారుమూల గిరిజన ప్రాంతమైన గుండాల గురుకుల కళాశాలకు విద్యార్థులు ప్రతిభ చూపారు. విద్యార్థులు డి.నరసింహ-78%, ఎన్.దేవిప్రసాద్-72%, జి.మనోహర్-58%, బి సతీశ్ కుమార్-57%, బి.గణేశ్-45% ఉత్తమ పర్సంటైల్ సాధించారు. కాగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ వి.సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ రామచంద్రరావు, అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.
News February 12, 2025
సంగారెడ్డి: రేపు ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలి: డీఈవో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739351004101_52434823-normal-WIFI.webp)
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలో రేపు సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలని సూచించారు.