News November 12, 2024
రాయచోటి: ‘రాష్ట్రంలో సంపద సృష్టి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు’
2024-2025వ సంవత్సరం సంపద సృష్టి లక్ష్యంగా అభివృద్ధి చక్రాన్ని పున: ప్రారంభించే ఉద్దేశ్యంతో రూ.2,94,427.25 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటిలో రాష్ట్ర బడ్జెట్‌పై కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్, టీడీపీ నాయకులు శివప్రసాద్ నాయుడు, బీజేపీ నాయకులు వెంకటరమణ గౌడ్ పాల్గొన్నారు.
Similar News
News December 27, 2024
తాడేపల్లిలో రైల్వే కోడూరు కానిస్టేబుల్ మృతి
రైల్వే కోడూరు మండలానికి చెందిన 95వ బ్యాచ్, 11వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజయ్య గురువారం మృతి చెందాడు. సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం తాడేపల్లికి వెళ్లారు. 2 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతను అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
News December 27, 2024
కడప: YVU పీజీ పరీక్షల తేదీల్లో మార్పులు
యోగి వేమన యూనివర్సిటీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. అనుబంధ పీజీ కళాశాల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 30 నుంచి జరగాల్సి ఉండగా.. 2025 జనవరి 21వ తేదీకి మార్చినట్లు ప్రిన్సిపల్ ఎస్ రఘునాథరెడ్డి తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేశామన్నారు. MA, Mcom, Msc, Mped ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.
News December 26, 2024
కడప: చిన్నారిని ఒంటరిని చేసిన రోడ్డు ప్రమాదం
ఉమ్మడి కడప జిల్లాలో ఓబుళవారిపల్లెలో ఆదివారం ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నరసింహ(40), భార్య సుజాత (35), బాల ముణిచరణ్(8) మృతిచెందగా.. చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చిన్నవయస్సులోనే ఆ చిన్నారి కుటుంబాన్ని కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది. కాగా.. వీరంతా బైక్‌పై వైకోటలో సుజాత అమ్మగారింటికి వెళ్లి వస్తుండగా.. వారిని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఆటో ఢీకొట్టింది.