News March 26, 2024

రాయచోటిలో ఆ MLA 5వ సారి గెలుస్తారా..?

image

రాయచోటిలో 1952 నుంచి 17సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే గడికోట శ్రీంకాత్ రెడ్డి 2009 నుంచి వరుసగా 4సార్లు గెలుపొందారు. 2012 ఎన్నికల్లో TDP అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం మరోమారు అవకాశం ఇచ్చింది. కాగా TDP నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారి ఇరువురిలో ఎవరు విజయం సాధించనున్నారు. కామెంట్ చేయండి.

Similar News

News November 17, 2024

కడప: ఇంకా లభ్యంకాని గల్లంతైన యువకుడి ఆచూకీ

image

కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద శుక్రవారం పెన్నానది నీటిలో గల్లంతైన గణేశ్ అనే యువకుడి కోసం శనివారం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, బంధువులు, రెస్క్యూ టీంతోపాటు జాలర్ల ద్వారా ట్యూబులు, రబ్బరు బోటు సహాయంతో నది వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. నేటికి కూడా యువకుడికి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు.

News November 17, 2024

పులివెందుల: ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం

image

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన పులివెందులలో చోటుచేసుకుంది. పులివెందుల పరిధిలోని ప్రశాంతి నగర్‌కు చెందిన యస్వంత్ సమీప కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషిస్తున్నాడని పులివెందుల అర్బన్ పోలీసులను యువతి ఆశ్రయించింది. అనంతరం అతనిపై SC, ST అట్రాసిటీ కేసు పెట్టింది.

News November 17, 2024

చింతకొమ్మదిన్నె: వాటర్ హీటర్ తగిలి బాలుడు మృతి

image

చింతకొమ్మదిన్నె మండలంలోని రింగ్ రోడ్డు సర్కిల్ వద్ద రేకుల షెడ్డులో విద్యుత్ షాక్‌తో మోక్షిత్ అనే బాలుడు శనివారం మృతి చెందాడు. వర కుమార్ అనే వ్యక్తి చైతన్య స్కూల్ హాస్టల్ విద్యార్థులకు బట్టలు ఉతికే కాంట్రాక్టు తీసుకుని హాస్టల్ బయట ఉన్న రేకుల షెడ్డులో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. స్నానం కోసం వేడినీళ్ల కోసం బకెట్లో ఉంచిన ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ తగిలి అతని కుమారుడు మోక్షిత్ షాక్‌తో మృతి చెందాడు.