News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు
Similar News
News March 15, 2025
సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 15, 2025
RCB: ఈసారైనా కప్ నమ్‌దేనా..!

IPL ఆరంభం నుంచి టైటిల్ కోసం RCB విశ్వప్రయత్నాలు చేస్తోంది. 17 సీజన్లు గడిచినా అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారైనా ఆ జట్టు కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తనదైన రోజు ఏ జట్టునైనా ఓడించగలిగే RCBలో కోహ్లీ, పాటీదార్, లివింగ్‌స్టోన్, సాల్ట్, బేథేల్, జితేశ్, డేవిడ్ లాంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్‌లోనూ యశ్ దయాల్, భువీ, ఎంగిడి, హేజిల్‌వుడ్, తుషార్ ఉన్నారు. మరి RCB ఈసారి కప్ కొడుతుందా?
News March 15, 2025
BREAKING: ఉప్పల్ సమీపంలో రోడ్డుప్రమాదం

డీసీఎం, బైక్ ఢీకొనటంతో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉప్పల్ భగాయత్ పరిధి ఫైర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది. ఉప్పల్ నుంచి నాగోల్ వైపు భగాయత్ మీదుగా వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తూ వెళుతుండగా వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టినట్లు అక్కడి వారు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.