News February 28, 2025
రాయపోల్: దీపం అంటుకొని ఇళ్లు దగ్ధం.. రోడ్డున పడిన కుటుంబం

విద్యుత్ ప్రమాదంలో పెంకుటిళ్లు దగ్ధమైన ఘటన రాయపోల్ మండలం పెద్దఆరేపల్లిలో రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కోంపల్లి శంకరయ్య భార్య లలితతో పాటు శివరాత్రి పండుగ సందర్భంగా రాత్రి ఇంట్లో దేవతలకు దీపం వెలిగించి ఇంటి బయట నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోఇళ్లు పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆదుకోవాలని స్థానికులు కోరారు.
Similar News
News February 28, 2025
APలో రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా?: సీఎం రేవంత్ రెడ్డి

TG: BJP, NDA పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉప కులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారని CM రేవంత్ వెల్లడించారు. ‘APలో NDA ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా కిషన్ రెడ్డి? భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా? APలో SC వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? మాదిగలకు ద్రోహం చేయడం లేదా?’ అని CM ప్రశ్నించారు.
News February 28, 2025
పెన్షన్ల పంపిణీ కోసం రూ.112.06 కోట్లు: తిరుపతి కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను మార్చి 1న ఉదయం లబ్ధిదారుల ఇంటి వద్దనే సిబ్బంది పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,62,461 మంది పెన్షన్ దారులకు సుమారు 112.06 కోట్ల రూపాయలను పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉదయం 7గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
News February 28, 2025
సిరిసిల్ల: చికిత్స పొందుతూ గర్భిణీ మృతి

కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన సిద్రవేణి సోని అనే గర్భిణీ మృతిచెందింది. చికిత్స కోసం ఆమె హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సోని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.