News March 22, 2025
రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జనగామ కలెక్టర్

జనగామ జిల్లాలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించి.. రాయితీని పొందుతూ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించిన దరఖాస్తు దారులకు 25 శాతం రాయితీనిస్తూ, వెంటవెంటనే భూమి క్రమబద్ధీకరణ చేస్తున్నారన్నారు.
Similar News
News March 22, 2025
BHPL: అటవీ భూముల కేటాయింపుపై సమీక్ష

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్అండ్‌బీ, మెగా ప్రాజెక్టు అధికారులకు అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News March 22, 2025
25 ఏళ్ల వరకూ డీలిమిటేషన్ ఉండొద్దు: స్టాలిన్

తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో డీలిమిటేషన్‌పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అనంతరం స్టాలిన్ మాట్లాడారు. ‘25 ఏళ్ల వరకూ నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని తీర్మానించాం. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో రెండో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కొన్ని కారణాల వల్ల TMC హాజరు కాలేదు. జగన్ కూడా మా వెంటే ఉన్నట్లు భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News March 22, 2025
విశాఖ: కళాకారులకు జిల్లాస్థాయి అవార్డులు

విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులను ఆదివారం కళా ప్రవీణ 2025 పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కే జనార్ధన్ పేర్కొన్నారు. శనివారం వారు మహారానిపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా నుంచి గుర్తింపు పొందిన కళాకారులను ఎంపిక చేసి స్థానిక కళ్యాణ మండపంలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.