News March 22, 2025
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ హనుమంతరావు

లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించి 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిశోర్ హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లే అవుట్ల క్రమబద్ధీకరణపై సమీక్షించారు. 25 శాతం రాయితీ అవకాశం మార్చి31తో ముగియనుందన్నారు.
Similar News
News December 13, 2025
ర్యాలీకి పోలీసులు సహకరించాలి: దేవినేని అవినాశ్

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించడం కొనసాగుతుందని, జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు. అక్టోబర్ 10 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నామని, NTR జిల్లాలో 4.22 లక్షలకు పైగా సంతకాలు వచ్చాయన్నారు. ఈ సంతకాలను కేంద్ర కార్యాలయానికి 15వ తేదీన ర్యాలీగా పంపిస్తామని, YCP నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి పోలీసులు సహకరించాలని కోరారు.
News December 13, 2025
పెద్దపల్లి: ‘నన్ను గెలిపిస్తే.. ఆరోగ్య బీమా చేయిస్తా’

పల్లె సంగ్రామంలో అభ్యర్థులు ఊహకందని హామీలతో ఓటర్లను ఆశ్చర్యపరుస్తున్నారు. తనను గెలిపిస్తే గ్రామంలోని ఆటో డ్రైవర్లు, హామాలీలకు ఆరోగ్య భీమా చేయిస్తానంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్‌కు చెందిన సర్పంచ్ అభ్యర్థి ఆకుల మణి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. యాక్సిడెంట్‌లతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ఆరోగ్య బీమాను ఎంచుకున్నట్లు చెబుతోంది.
News December 13, 2025
ఏ పంటలకు ఎలాంటి కంచె పంటలతో లాభం?

☛ వరి పొలం గట్ల మీద కంచె పంటలుగా బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్నను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రాకుండా ఆపవచ్చు. ☛వేరుశనగలో జొన్న, సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్కా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి తగ్గుతుంది. ☛ మొక్కజొన్న చుట్టూ 4, 5 వరుసల ఆముదపు మొక్కలను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.


