News April 13, 2025
రాష్ట్ర స్థాయి టాపర్‌గా ఆదర్శ రైతు కుమారుడు

కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన ఆదర్శ రైతు కారుమంచి షేక్ అహ్మద్ కుమారుడు షేక్ ఆసిఫ్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించారు. బైపీసీలో 440/430 మార్కులు సాధించి టాప్-10లో చోటుసాధించారు. విద్యార్థిని లెక్చరర్లు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఆసిఫ్ మాట్లాడుతూ.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వైద్య విద్య పూర్తి చేసి గ్రామస్థులకు సేవలందిస్తానని చెప్పారు.
Similar News
News April 15, 2025
మహానందిలో మిస్టరీగానే వ్యక్తి మరణం

మహానంది సమీపంలోని అరటి తోటలో నిన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వివరాల కోసం రంగంలోకి దిగన ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా మృతదేహానికి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మహానందిలోని ఈశ్వర్ నగర్ శివారులో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది.
News April 15, 2025
నంద్యాల జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్

నంద్యాలలో కొన్ని నెలలుగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. మద్దికేర గ్రామానికి చెందిన దూదేకుల షాహిద్, పందిపాడు గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరిని సోమవారం అరెస్టు చేసి వారి నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
News April 15, 2025
ఆళ్లగడ్డలో టీడీపీ నేతపై దుండగుల దాడి

ఆళ్లగడ్డలో టీడీపీ నేత సింగం భరత్ రెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. నాలుగు రోడ్ల సెంటర్‌లో కర్రలతో కిరాతకంగా కొట్టడంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తీసుకెళ్లారు. గేటు వసూళ్ల విషయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.