News March 6, 2025
రాష్ట్ర స్థాయిలో ఆదర్శ పాఠశాలగా జక్కాపూర్

రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉన్నత పాఠశాల జక్కాపూర్ ఉన్నత పాఠశాల అని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్ని రకాల సౌకర్యాలతో కూడిన విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.
Similar News
News March 6, 2025
NZB: ఇంటర్ పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

డిచ్పల్లిలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులను సందర్శించి, పరీక్షల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా గట్టి నిఘాతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని సూచించారు.
News March 6, 2025
భయం.. భయం: అంతుచిక్కని వ్యాధితో నెలలో 13 మంది మృతి

ఛత్తీస్‌గఢ్, సుక్మా జిల్లాలోని ధనికోర్టాలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు భయపడుతున్నారు. చెస్ట్ పెయిన్, దగ్గుతో ఇక్కడ నెల రోజుల్లోనే 13 మంది చనిపోయారు. వ్యాధేంటో, దాని కారణాలేంటో తెలియక వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. సీజన్ మారడం, ఇప్పపూల కోసం రోజంతా అడవిలో పనిచేసి డీహైడ్రేషన్‌తో చనిపోతున్నారని వారు భావిస్తున్నారు. క్యాంపు వేసి ORS ఇస్తూ అవే లక్షణాలున్న బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
News March 6, 2025
పార్వతీపురం:‘తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి’

వేసవిలో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు అధికార యంత్రాంగం చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. గురువారం మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా తాగునీటి ఎద్దడిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.