News March 3, 2025
రాష్ట్రంలో ఆ మూడు జిల్లాలే TOP

రాష్ట్ర గణాంకాల నివేదిక-2024 వివరాలు విడుదలయ్యాయి. ఈ నివేదికలో కీలక అంశాలను పొందుపరిచారు. స్థూల జిల్లా జాతీయ ఉత్పత్తిలో 2022-23లో రంగారెడ్డి జిల్లా రూ.2.85 లక్షల కోట్లతో ఉండగా, హైదరాబాద్ రూ.2.30 లక్షల కోట్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రూ.88,940 కోట్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, తదనుగుణంగా చర్యలు చేపడుతున్నారు.
Similar News
News March 4, 2025
HYD: ‘దళితుడిని సీఎం చేసిన పార్టీ కాంగ్రెస్’

మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని, రాష్ట్రంలో దళితుడిని సీఎం చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. BRS దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, పింక్ బుక్ ఓపెన్ చేస్తే కవిత చేసిన స్కామ్‌లే పాములై బయటకొచ్చి కాటేసే ప్రమాదం ఉందన్నారు.
News March 3, 2025
HYD: ‘కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి’

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోని జరుగుతుందన్నారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు.
News March 3, 2025
HYD: రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్

హైదరాబాద్: రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) తరహాలో రోడ్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఆర్అండ్బీ శాఖాధికారులు కసరత్తు ప్రారంభించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డు ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని ఇతర రహదారులను కూడా మెరుగుపరచడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.