News March 20, 2025

రాష్ట్రంలోనే జమ్మికుంట, హుజూరాబాద్ టాప్

image

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ అయాజ్ పేర్కొన్నారు. ఈ ఘనత మున్సిపల్ ప్రజలు, సిబ్బంది వల్లే సాధ్యమైందని ఇరువురు తెలిపారు.

Similar News

News March 21, 2025

తెలంగాణ ఊటీ.. అనంతగిరి అందాలను కాపాడుకుందాం

image

VKBకు 6 కి.మీ. దూరంలో ఉన్న ‘అనంతగిరి కొండలు’ ప్రకృతి అందాలకు నెలవు. దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణంలో అటవీ అబ్బుర పరుస్తోంది. అటవీ మధ్య 1300 ఏళ్ల చరిత్ర గల ‘అనంత పద్మనాభస్వామి ఆలయం’ అందరినీ ఆకర్షిస్తోంది. అనంతగిరిని ‘తెలంగాణ ఊటీ’ అంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువ. ప్రస్తుతం ఈ అటవీలో చాలా చెట్లు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకుంటే మరిన్ని అందాలను అనంతగిరి ప్రజలకు పంచుతుంది.

News March 21, 2025

పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రతీక్ జైన్

image

జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ కేంద్రంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు.

News March 21, 2025

భారీగా తగ్గిన సిల్వర్ రేటు

image

బంగారం ధరలు కాస్త తగ్గి సామాన్యుడికి ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.90,200కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.

error: Content is protected !!