News October 16, 2024

రాష్ట్రంలోనే నంద్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురండి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర@2047లో భాగంగా నంద్యాల జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న నిర్దిష్ఠ లక్ష్యంతో అధికారులు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో స్థూల దేశీయోత్పత్తి, ఆదాయ వృద్ధిరేట్లపై జిల్లా అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

Similar News

News October 17, 2024

ఆలూరు: చేనుకు గడ్డి మందు కొట్టిన దుండగులు

image

ఆలూరు మండలంలోని మనేకుర్తి గ్రామానికి చెందిన ఈరమ్మ 9 ఎకరాల్లో రూ.1.50 లక్షల ఖర్చుతో జొన్న పంట సాగుచేసింది. బుధవారం చేనుకు వెళ్లి చూడగా పంటకు ఎవరో గడ్డిమందు కొట్టారని బాధిత మహిళ వాపోయింది. అయితే ఆస్తి పంపకాలు చేయలేదని తన కుమారులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News October 16, 2024

నంద్యాల జిల్లాలో నేడు సెలవు

image

నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేశామని అన్నారు. కాగా కర్నూలు జిల్లాలో సెలవు ప్రకటించలేదు.

News October 16, 2024

నంద్యాల జిల్లాలో సెలవు ఇవ్వాలని డిమాండ్

image

అల్పపీడన ప్రభావంతో నంద్యాల జిల్లాలో జోరు వాన పడుతోంది. మహానంది, రుద్రవరం, ఆళ్లగడ్డ, కొలిమిగుండ్ల, నంద్యాల, అవుకు తదితర మండలాల్లో నిన్నటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. మరోవైపు నేడు, రేపు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలపడంతో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముసురు వాతావరణం నెలకొనడంతో బయటకు వచ్చే పరిస్థితిలేదని సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.