News January 22, 2025

రాష్ట్రపతి విందుకు చిత్తూరు మహిళ

image

రాష్ట్రపతితో విందుకు చిత్తూరు మహిళకు ఆహ్వానం అందింది. రిపబ్లిక్‌డే సందర్భంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులను దేశవ్యాప్తంగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా PMAY పథకంలో చిత్తూరు న్యూ ప్రశాంత్ నగర్‌లోని సల్మా ఎంపికయ్యారు. ఆహ్వాన లేఖను పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గణపతి అందజేశారు. సల్మాతో పాటు ఆమె భర్తకు ఢిల్లీకి రాకపోకలు, వసతి ఖర్చులను రాష్ట్ర భవన్ భరిస్తుందని లేఖలో తెలిపారు.

Similar News

News January 22, 2025

చిత్తూరు జిల్లా మావోయిస్ట్.. ఇద్దరి MLAల హత్యలో పాత్ర

image

బలగాల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తవణంపల్లె మండలానికి చెందిన మావోయిస్టు చలపతి మదనపల్లెలో ఉద్యోగం ప్రారంభించారు. అనంతరం ఉద్యోగం వదిలి చిత్తూరు జిల్లా అడవుల్లో ఉద్యమాలను నడిపించారు. విశాఖ చేరుకున్నాక నక్సల్స్‌తో పరిచయాలు పెంచుకున్నారు. అనంతరం మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ఎదిగి, మాజీ MLAలు కిడారి సర్వేశ్వర్‌రావు, సివేరి హత్య ఘటనతోపాటూ CM చంద్రబాబుపై బాంబు దాడిలో కీలకంగా వ్యవహరించారు.

News January 22, 2025

చిత్తూరు: మెరిట్ లిస్ట్ విడుదల

image

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (NUHM) ప్రాజెక్టులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదలైనట్లు చిత్తూరు DMHO సుధారాణి పేర్కొన్నారు. మెరిట్ జాబితాను https://chittoor.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు. ఈనెల 28వ తేదీ లోపు అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు.

News January 21, 2025

BJP చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా జగదీశ్వర్ నాయుడు

image

బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా జగదీశ్వర్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కర్నాటి యల్లా రెడ్డి, జిల్లా పరిశీలకులు ముని సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మంగళవారం అధ్యక్ష ఎన్నిక జరిగింది. పార్టీ రాజ్యాంగ సిద్ధాంతాల నియమావళి ప్రకారం ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అనంతరం నియామక పత్రాలను అందజేశారు.