News October 30, 2024

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థి ఎంపిక

image

చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన గునుగంటి శ్రీజ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీల్లో శ్రీజ ప్రతిభ కనబరిచింది. వచ్చే నెల 2,3,4 తేదీల్లో కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది. ప్రధానోపాధ్యాయురాలు జయ, ఉపాధ్యాయులు శ్రీజను అభినందించారు.

Similar News

News October 29, 2024

జాతీయస్థాయి సెమినార్‌కు వరంగల్ విద్యార్థి

image

చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన ZPHS 9వ తరగతి విద్యార్థి భూర వినయ్ కుమార్ ఈరోజు హైదరాబాదులోని SCERTలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో మొదటి స్థానం కైవసం చేసుకొన్నాడు. నవంబర్ 26న ముంబైలోని నెహ్రూ సైన్స్ సెంటర్‌లో జరిగే జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపికయ్యాడని వరంగల్ DEO మామిడి జ్ఞానేశ్వర్, WGL జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ తెలిపారు.

News October 29, 2024

RTC వరంగల్ రీజియన్‌కు ఎలక్ట్రిక్ బస్‌లు

image

ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్‌లు వస్తున్నాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డీ.విజయ భాను తెలిపారు. సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, సెమీడీలక్స్ మొత్తం 82 బస్‌లు వస్తున్నాయన్నారు. వీటిని హనుమకొండ నుంచి HYD, నిజామాబాద్, KNR, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం రూట్లలో నడుపనున్నట్లు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉన్నాయన్నారు. వచ్చే నెలలో నడుస్తాయన్నారు.

News October 29, 2024

WGL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 28 మందికి భారీ జరిమానా

image

వరంగల్ ట్రాఫిక్ PS పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడ్డ నలుగురు వాహనదారులకు మంగళవారం వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి రూ.5,000 జరిమానా విధించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 28 మందికి రూ.36,100 జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కే.రామకృష్ణ తెలిపారు.