News August 23, 2024
రియాక్టర్ పేలుడు ఘటనలో భద్రాద్రి జిల్లా వాసి మృతి
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద గల ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాద ఘటనలో అశ్వారావుపేట మండలం గంగారం గ్రామానికి చెందిన మార్ని సురేంద్ర(37) మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. సురేంద్ర గాజువాకలో నివాసం ఉంటూ తొమ్మిదేళ్లుగా అచ్యుతాపురంలో గల ఫార్మా సెజ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రియాక్టర్ పేలుడు ప్రమాదంలో చిక్కుకుని దుర్మరణం చెందాడు.
Similar News
News January 21, 2025
‘కన్న కూతురిని చంపబోయాడు’
కన్న కూతురిని తండ్రి కడతేర్చాలని చూసిన ఘటన ఈ నెల 13న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. టేకులపల్లి మం. సంపత్ నగర్‌కు చెందిన కొర్స రవి-లక్ష్మి దంపతులు. రవి భార్యతో గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన అతను కూతురికి చాక్లెట్స్ కొనిస్తానని పక్కనే ఉన్న జామాయిల్లోకి తీసుకెళ్లి చంపబోయాడు. ఇంటికి వచ్చి బాలిక విషయం తల్లికి చెప్పడంతో అమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News January 21, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు
∆} జూలూరుపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వరావుపేట లో ఎమ్మెల్యే పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News January 21, 2025
ఖమ్మం మార్కెటుకు పోటెత్తిన మిర్చి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మిర్చి పోటెత్తింది. దాదాపు 30 వేల బస్తాలను రైతులు విక్రయానికి మార్కెట్‌కు తీసుకువచ్చారు. ఈ కొత్త సంవత్సరంలో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. ఈ నెల రెండోవారంలో 10 వేలు, సంక్రాంత్రి తర్వాత 16న 15 వేల బస్తాల మిర్చి వచ్చిందన్నారు. నిన్న దానికి రెట్టింపు వచ్చిందని పేర్కొన్నారు. మిర్చి విక్రయాలు పెరుగుతున్న ధరలో మాత్రం పురోగతి లేదని రైతులు చెబుతున్నారు.