News April 7, 2025
రుద్రంగి: ఫుడ్ పాయిజన్‌తో బాలుడి మృతి

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు ఫుడ్ పాయిజన్‌తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి <<16017738>>తల్లి<<>> పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటీ పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిన్నాక వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 11, 2025
KNR: మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, బిసి విద్యార్థి సంఘ నాయకులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
News April 11, 2025
రేపు కరీంనగర్‌కు రానున్న కేటీఆర్

కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్‌లోని చింతకుంట బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ సభ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు కమలాకర్ తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలోనే కొనసాగుతాయని చెప్పారు.
News April 11, 2025
KNR జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత.. 11 మండలాల్లో 40°C పైగా నమోదు

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట, మానకొండూర్ మండలాల్లో 41.4°C నమోదు కాగా, ఇల్లందకుంట, గన్నేరువరం 41.2, తిమ్మాపూర్ 41.1, కరీంనగర్ రూరల్ 41.0, చిగురుమామిడి 40.9, కరీంనగర్ 40.4, గంగాధర, వీణవంక, కొత్తపల్లి 40.3, రామడుగు 39.9, శంకరపట్నం 39.8, సైదాపూర్ 39.7, హుజూరాబాద్ 39.5, చొప్పదండి 38.4°C గా నమోదైంది.