News March 29, 2025

రుద్రవరంలో మరోసారి భానుడి విశ్వరూపం.!

image

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం శనివారం నంద్యాల(D) రుద్రవరంలో రాష్ట్రంలోనే 43.5°C, కర్నూలు(D) ఉలిందకొండలో 42.4°C ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, గత కొద్దిరోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

Similar News

News April 2, 2025

CM రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

TG: MLAల అనర్హత కేసు విచారణ సందర్భంగా CM రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపఎన్నికలు రావని అసెంబ్లీలో ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ‘ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో CM ప్రకటిస్తే అది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమే. అవసరమైతే దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని CMకు హితవు చెప్పాలి’ అని స్పీకర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

News April 2, 2025

వరంగల్ మార్కెట్‌లో చిరుధాన్యాల ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.5,900, పచ్చి పల్లికాయ రూ.4,850 పలికింది. పసుపు (కాడి) క్వింటా ధర రూ.12,359, పసుపు (గోల)కి రూ.10,729 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,285 పలికినట్లు అధికారులు వెల్లడించారు.

News April 2, 2025

‘విశ్వంభర’ కోసం సింగర్‌గా మారిన మెగాస్టార్?

image

మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈక్రమంలో అంచనాలు మరింత పెంచేందుకు మెగా గాత్రాన్ని వాడుకునేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సినిమాలో ఓ పాట పాడేందుకు చిరు ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అప్డేట్ రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

error: Content is protected !!