News March 26, 2025
రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికం..!

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి కాలం ప్రారంభంలోనే ఈ స్థాయిలో భానుడు విరుచుకుపడటంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, కొద్దిరోజులుగా నంద్యాల జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.
Similar News
News March 29, 2025
కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి: బాపట్ల కలెక్టర్

సహకార సంఘాల కంప్యూటరీకరణను వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శనివారం బాపట్ల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలలోని సహకార సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చెయ్యడంలో అధికారులు అలసత్వం వహించడంపై కలెక్టర్ అసహనం వ్యక్తపరిచారు.
News March 29, 2025
డెబ్యూలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. చరిత్ర సృష్టించాడు

పాక్‌తో జరిగిన తొలి వన్డేలో కివీస్ ప్లేయర్ మహమ్మద్ అబ్బాస్ చరిత్ర సృష్టించారు. డెబ్యూ మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(26 బంతుల్లో 52) చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఇందులో 3 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. అలాగే 7 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా తీశారు. కాగా 5 టీ20ల సిరీస్‌ను 4-1తో కోల్పోయిన పాక్, 3 వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో ఓడిపోయింది.
News March 29, 2025
వివేకా హత్య కేసు నిందితులకు త్వరలో సినిమా: ఆదినారాయణ రెడ్డి

AP: వివేకా హత్య కేసులో CBI మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని MLA ఆదినారాయణ రెడ్డి అన్నారు. దీంతో ఆ కేసులోని నిందితులకు త్వరలోనే సినిమా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌లో MP అవినాశ్ పాత్రే ఎక్కువగా ఉందని తెలిపారు. మరోవైపు, తనకు YCP నేతల నుంచి ప్రాణహాని ఉందని ఇదే కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఇవాళ కడపలో వాపోయారు.