News November 19, 2024

రుషికొండ భవనాలపై మీ కామెంట్?

image

వైసీపీ హయాంలో నిర్మించిన రుషికొండ భవనాలపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. కోట్ల ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ విలాసాలకు భవనం నిర్మించుకున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అవసరాలకు కోసం వాటిని నిర్మించామని వైసీపీ నాయకులు ఆ ఆరోపణలకు తిప్పికొడుతున్నారు. అయితే ఆ భవనాలను రాష్ట్ర ఆదాయ వనరులుగా మలచాలని పలువురు సూచిస్తున్నారు. మరి భవనాలు దేనికి వినియోగిస్తే బాగుంటుందో కామెంట్ చెయ్యండి.

Similar News

News December 4, 2024

విశాఖలో స్వల్ప భూప్రకంపన..!

image

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మరి మీ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయా?

News December 4, 2024

ఈనెల 5న విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 5న విశాఖ వస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. చంద్రబాబు రెండు రోజులు పాటు విశాఖలో ఉండి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ)పై సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ మంగళవారం పరిశీలించారు.

News December 4, 2024

కేంద్ర మంత్రితో విశాఖ ఎంపీ భేటీ

image

కేంద్ర పరిశ్రమలు & వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో విశాఖ ఎంపీ శ్రీభరత్ ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. వాణిజ్య మంత్రిత్వ శాఖకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎంపీ పారిశ్రామిక వృద్ధి, అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశాఖ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడలో ఐఐఎఫ్టీ పురోగతిపై చర్చించారు.