News November 27, 2024
రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే కూనంనేని
అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దీంతోపాటు అదానీ చేసుకున్న ఒప్పందాలలో ఏమైనా అవినీతి జరిగిందా అనే కోణాన్ని కూడా ప్రభుత్వం బయట పెట్టాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
Similar News
News November 27, 2024
భద్రాచలాన్ని మండలంగా ప్రకటిస్తూ జీవో జారీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరొక మండలాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. భద్రాచలం పట్టణాన్ని మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ను వెలువరించింది. భద్రాచలాన్ని మండలంగా ప్రకటిచడంతో మళ్లీ ఎన్నికల సందడి నెలకొననుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎంపీపీ జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాలు అనందం వ్యక్తం చేస్తున్నాయి.
News November 27, 2024
CM రేవంత్ తో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. నిర్దిష్ట సమయంలో ధాన్యం సేకరణ పూర్తి కావాలని, సేకరించిన వాటికి చెల్లింపులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అటు జిల్లాలో జరుగుతున్న ధాన్యం సేకరణ వివరాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
News November 26, 2024
కొత్తగూడెం ఎయిర్‌పోర్డుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని సీఎం తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. త్వరలోనే కొత్తగూడేనికి సాంకేతిక బృందాన్ని పంపించనున్నట్లు చెప్పారు. కొత్తగూడెంతో పాటు వరంగల్ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు.