News March 18, 2024
రూ.5.73 కోట్ల విలువగల బంగారం పట్టివేత: ఎస్పీ

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ముమ్మర తనిఖీలు చేపట్టిందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఈరోజు మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఆపి తనిఖీ చేయగా.. రూ.5.73 కోట్ల బంగారం పట్టుకున్నట్లు తెలిపారు.
Similar News
News April 21, 2025
చిట్యాల: 25 ఏళ్ల తర్వాత అ‘పూర్వ’ కలయిక

చిట్యాల (M) ఉరుమడ్ల ZPHSలో 1998-99 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత దాదాపు 50 మంది ఒకేచోట చేరి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులను సన్మానించారు. వేముల వెంకటేశం, కోనేటి యాదగిరి, పానుగుల్ల నరసింహ, కృష్ణ, యానాల సుధ, చంద్రకళ పాల్గొన్నారు. మీ స్నేహితులతో మీరేప్పుడు ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి.
News April 20, 2025
NLG: కమ్మని కల్లు.. మనసు జిల్లు!

ఈ ఏడాది జిల్లాలో కల్లుకు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా మద్యం ధరలు పెంచడంతో ఎక్కువ మంది కల్లు కిక్కును కోరుకుంటున్నారు. ప్రస్తుతం తాటి కల్లు సీజన్ కావడంతో మందుబాబులు ఆ మత్తు పానీయం కోసం పరుగులు తీస్తున్నారు. ధర తక్కువ కావడంతో పేదలు, కూలీలు దీనిని సేవిస్తుంటారు. జిల్లాలో చాలాచోట్ల కల్లు ధరలు పెరిగినా ఆరోగ్యానికి మంచిది కావడంతో చాలామంది కల్లువైపే ఆసక్తి చూపుతున్నారు.