News February 12, 2025

రూ.లక్ష లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన దుబ్బాక ఆర్ఐ

image

దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి మండలంలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 13, 2025

నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్-2 హాల్ టికెట్లు

image

AP: గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది. నేటి నుంచి అభ్యర్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్షలకు వచ్చే సమయంలో హాల్ టికెట్లు మాత్రమే తీసుకురావాలని APPSC స్పష్టం చేసింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఎగ్జామ్ సెంటర్లలో 89,900 మంది పరీక్ష రాయనున్నారు.

News February 13, 2025

కోహ్లీ ఏ జట్టుపై ఎన్ని రన్స్ చేశారంటే?

image

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యధికంగా ఆస్ట్రేలియాపై 5393 పరుగులు (ఆల్ ఫార్మాట్స్) చేశారు. ఆ తర్వాత శ్రీలంక (4076), ఇంగ్లండ్ (4038), వెస్టిండీస్ (3850), సౌతాఫ్రికా (3306), న్యూజిలాండ్ (2915), బంగ్లాదేశ్ (1676), పాకిస్థాన్ (1170), ఆఫ్గానిస్థాన్ (347), జింబాబ్వే (305), నెదర్లాండ్స్ (125), ఐర్లాండ్ (88), హాంగ్ కాంగ్ (59), యూఏఈ (33), స్కాట్లాండ్‌పై 2 రన్స్ చేశారు.

News February 13, 2025

విశాఖ వైసీపీ ఉపాధ్యక్షుడిగా బాణాల

image

విశాఖ జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా బాణాల శ్రీనివాసును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గడిచిన ఎన్నికల్లో బాణాల శ్రీనివాసరావు వైసీపీకి కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన జీవీఎంసీ 44వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్నారు. జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేస్తున్నారు.

error: Content is protected !!