News April 18, 2024

రెంజల్: నీటిలో మునిగి పదోతరగతి విద్యార్థి మృతి

image

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కందకుర్తి గోదావరి నదిలో బుధవారం స్నానానికి వెళ్లిన నవాజ్ (16) అనే పదో తరగతి విద్యార్థి నీట మునిగి మృతి చెందినట్లు SI సాయన్న తెలిపారు. నవాజ్.. స్నేహితులతో కలిసి మొగులపురా శివారు వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లాడు. నదిలో గుంతల లోతు తెలియక, ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

Similar News

News January 11, 2025

రాజంపేట్: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

image

రాజంపేట్ మండలం అర్గోండలో అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజశేఖర్(27) గతంలో జీవనోపాధి కోసం అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతూ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు.

News January 11, 2025

చింతకుంట అటవీ ప్రాంతంలో ఆవు పై చిరుత పంజా

image

మోస్రా మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గజ్జి నారాయణ ఆవులు మేత మేయడానికి వెళ్లగా చిరుత ఆవుపై దాడి చేసింది. పెంపుడు కుక్కలు అరవడంతో ప్రాణాలతో బయట పడ్డట్టు బాధితుడు తెలిపారు. అటవీ ప్రాంతంలో చిరుతలు ఉన్నట్టు గతంలో గుర్తించినట్లు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ హుస్సేన్ తెలిపారు. కాపరులు గుట్ట పైకి వెళ్ల కూడదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News January 11, 2025

NZB: ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తాం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాగాన్ని సన్నద్ధం చేస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సీఎస్, మంత్రులు హైదరాబాద్‌లో నిర్వహించిన కలెక్టర్‌ల సదస్సులో పాల్గొన్న అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 26 తరువాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాలు అమలు చేస్తోందని, వాటిని విజయవంతం చేసేలా పని చేస్తామన్నారు.