News April 13, 2025
రెంటచింతలలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత

రెంటచింతల పరిసర ప్రాంతాలలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 40.4 డిగ్రీలుగా నమోదు అయినట్లు జంగమహేశ్వరంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచే రెంటచింతల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో ఎండ నిప్పుల కొలిమిని తలపించింది. గ్రామాలలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆకాశం మేఘావృతం అయింది. సాయంత్రానికి 27.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News April 16, 2025
మరోసారి నిరాశపరిచిన ‘మెక్‌గర్క్’

ఢిల్లీ బ్యాటర్ మెక్‌గర్క్ మరోసారి నిరాశపరిచారు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో రెండు ఫోర్లు కొట్టి ఊపు మీదున్నట్లు కనిపించినా 9 పరుగులకే ఔటయ్యారు. ఈ సీజన్‌లో 6 ఇన్నింగ్సుల్లో 55 పరుగులే చేశారు. ఇందులో అత్యధికం 38 రన్స్. గత ఏడాది 9 ఇన్నింగ్సుల్లో 330 పరుగులు చేసిన ఈ హిట్టర్ ఈ సారి తేలిపోతున్నారు. మరి తర్వాతి మ్యాచుల్లోనైనా ఫామ్ అందుకొని ఢిల్లీకి శుభారంభం అందిస్తారో లేదో వేచిచూడాలి.
News April 16, 2025
ఆ రేప్ సీన్ పూర్తికాగానే వామిటింగ్ చేసుకున్నా: హీరోయిన్

‘కాఫిర్’ మూవీలోని రేప్ సీన్‌లో నటించిన సమయంలో వణికిపోయినట్లు హీరోయిన్ దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీన్ షూట్ పూర్తికాగానే వామిటింగ్ చేసుకున్నా. సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు అందులో లీనం కావాలి. అప్పుడే పూర్తి న్యాయం చేయగలుగుతాం’ అని చెప్పారు. షెహనాజ్ పర్వీన్ అనే పాకిస్థానీ మహిళ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఆమె దారితప్పి INDలోకి ప్రవేశించి, ఎనిమిదేళ్లు జైలుశిక్ష అనుభవించింది.
News April 16, 2025
శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్న NDSA బృందం

తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టును NDSA(నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఛైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 29న పరిశీలించనున్నారు. ప్రాజెక్టు సమస్యలు, భద్రతను తనిఖీ చేసిన అనంతరం ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీ అవుతారు. అంతకంటే ముందు 28న ఏపీ అధికారులతో, 30న HYDలో తెలంగాణ అధికారులతో విడివిడిగా సమావేశమై చర్చలు జరపనున్నారు.