News April 5, 2024

రెంటచింతలలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

పల్నాడు జిల్లా రెంటచింతలలో శుక్రవారం 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో ఈ ఉష్ణోగ్రత నమోదవుతుందని మే 15 నుంచి 25 నాటికి ఉష్ణోగ్రతలు ఇక్కడ 50 డిగ్రీలకు మించుతుందని ఈ సంవత్సరం ఇప్పుడే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావటం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు. రోహిణి కార్తెలో ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.

Similar News

News February 5, 2025

గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి మృతి

image

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌత్రాడౌన్‌లో అంజుమ్ అనే చిన్నారి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మరణించిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. జలుబుతో ఇబ్బంది పడుతుందని చిన్నారిని ఆసుపత్రిలో చూపించడానికి వస్తే ఇలా జరిగిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు. లాలాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 5, 2025

నగ్న వీడియోలతో బెదిరింపులు.. గుంటూరు వ్యక్తిపై కేసు

image

సాఫ్ట్‌వేర్ యువతులను ట్రాప్ చేసి వీడియో కాల్స్ రికార్డ్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి గుంటూరు, నల్లచెరువు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బీటెక్ నుంచే అడ్డదారి పట్టాడని, నిందితుడు తండ్రి మస్తాన్ దర్గాకు వారసత్వ ధర్మకర్త కాగా మస్తాన్ వద్ద 80పైగా వీడియో కాల్స్ దృశ్యాలు ఉన్నాయన్నారు. 

News February 5, 2025

తెనాలి: రైలు నుంచి జారిపడి వాచ్ మెన్ మృతి

image

రైలు నుంచి జారి పడి గాయాలపాలైన ప్రయాణికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చీరాలకు చెందిన భాస్కర్‌(48) నిడుబ్రోలులోని రైతుబజార్‌లో వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రైలులో ప్రయాణిస్తూ తెనాలి స్టేషన్‌లో రైలు నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు వైద్యశాలకు పంపగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!