News February 7, 2025
రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738889875075_60434090-normal-WIFI.webp)
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నిన్న రాత్రి మృతిచెందాడు. క్రిష్ణగిరి(M) తొగిడిచెడుకు చెందిన పెద్ద గిడ్డయ్య, ఆయన భార్య ఈనెల 4న పొలం పనులకు వెళ్తుండగా.. అదే మార్గాన కొత్తూరుకు చెందిన శివ తొగిడిచెడుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి బైక్‌లు ఢీకొన్నాయి. గిడ్డయ్యకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్థులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News February 7, 2025
ఫొటోల మార్ఫింగ్ కేసు.. విచారణకు హాజరైన RGV
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738215793336_893-normal-WIFI.webp)
AP: కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆయనపై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులివ్వడంతో ఒంగోలు రూరల్ పీఎస్‌లో ఇవాళ విచారణకు హాజరయ్యారు.
News February 7, 2025
వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738906901904_51565492-normal-WIFI.webp)
కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.
News February 7, 2025
విజయవాడలో భారీ దొంగతనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738910281085_51960253-normal-WIFI.webp)
విజయవాడ శివారు ఎనికేపాడులో భారీ దొంగతనం జరిగింది. పటమట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎనికేపాడులోని ఐఫోన్ గోడౌన్ రేకు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు రూ.2.50కోట్ల విలువైన 372 ఐఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు.