News February 4, 2025

రెండు మండలాలతో అమీన్ పూర్ మండల పరిషత్

image

రాష్ట్రంలోని అతి చిన్న మండల పరిషత్‌గా అమీన్ పూర్ నిలిచింది. రెండు గ్రామపంచాయతీలతో మండల పరిషత్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని వడక్ పల్లిలో 820 ఓట్లతో మూడు ఎంపీటీసీ, జానకంపేట 640 ఓట్లతో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 6 పంచాయతీలను అమీన్ పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.

Similar News

News February 4, 2025

తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

image

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అనకాపల్లి: గణనీయంగా తగ్గిన టమాటా ధరలు

image

గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో సోమవారం జరిగిన వారపు సంతలో టమాటా ధర కిలో రూ.5కు పడిపోయింది. 30 కిలోల క్రేట్ టమాటాల ధర రూ.140 నుంచి రూ.150 పలికింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు టమాటాలను తీసుకురావడంతో ధరలు గణనీయంగా తగ్గిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఇదే విధంగా ధరలు కొనసాగితే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.