News March 20, 2025
రెండో రోజు 352 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా బుధవారం పదో తరగతి విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. 135 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 352 మంది గైర్హాజరు అయ్యారు. 30,862 మందికి గానూ 30,537 మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ రాంనరగ్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో A, B పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News March 21, 2025
అనంతపురం అభివృద్ధిపై సీఎంతో చర్చ

విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును గురువారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురూ చర్చించారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ తరలింపు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరువ వంక ప్రొటెక్షన్ వాల్ గురించి సీఎంకు వివరించినట్లు ఎమ్యెల్యే తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
News March 21, 2025
CMను కలిసిన అనంత దళిత ఎమ్మెల్యేలు

అమరావతిలో సీఎం చంద్రబాబును శింగనమల, మడకశిర ఎమ్మెల్యేలు బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. దళితులందరికీ సమాన న్యాయం చేకూరాలనే ఉక్కు సంకల్పంతో చంద్రబాబు గతంలో చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి దళిత శాసనసభ్యులందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
News March 20, 2025
ATP: భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి బరితెగించారు. కట్టుకున్న భార్య చెవి కోసి అమ్మడానికి కమ్మలు తీసుకెళ్లిన ఘటన అనంతపురం(D)లో జరిగింది. పెద్దపప్పూరు మం. వరదాయపల్లికి చెందిన శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 17న మద్యం మత్తులో భార్య చెవిని కోసి కమ్మలు తీసుకెళ్లడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు నిందితుడిని అరెస్ట్ అరెస్టు చేసి రిమాండ్‌కి పంపినట్లు SI నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.