News April 28, 2024

రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది కి సంబంధించి రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జనరల్ అబ్జర్వర్లు జాఫర్, మీర్ తారిఖ్ ఆలీ సమక్షంలో పోలింగ్ సిబ్బందికి సంబంధించిన రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.

Similar News

News October 1, 2024

800 మందితో భారీ బందోబస్తు: కర్నూలు ఎస్పీ

image

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో నేడు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బిందు మాధవ్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. DSPలు-5, CIలు-38, SIలు-40, ASI, HCలు-160, PCలు-213, హోంగార్డులు-106 మందితో పాటుగా 3 ఏఆర్, 5 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించినట్లు ఈమేరకు ఎస్పీ వెల్లడించారు.

News September 30, 2024

కర్నూలు: మార్కెట్‌కు ఉల్లి సరకు తీసుకురావద్దు

image

కర్నూలు మార్కెట్‌కు రైతులు ఉల్లి సరకు తీసుకురావద్దని రైతులకు, కమిషన్ దారులకు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్.జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌లో అత్యధికంగా ఉల్లి వచ్చినందున మార్కెట్‌లో ఎక్కడా స్థలం కూడా ఖాళీ లేదని చెప్పారు. లారీలు వచ్చి వెళ్లడానికి కూడా ట్రాఫిక్ సమస్య ఉందని తెలిపారు.

News September 30, 2024

నంద్యాల: చెరువులో శిశువు మృతదేహం కలకలం

image

నంద్యాల పట్టణంలోని చెరువులో నెల వయసున్న శిశువు మృతదేహం సోమవారం కలకలం సృష్టించింది. అటుగా వెళుతున్న కొందరు సమాచారాన్ని పోలీసులకు అందించారు. చెరువు దగ్గరికి వచ్చి శిశువును పరిశీలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. చెరువులో బతికి ఉన్న శిశువును పడేశారా లేదా చనిపోయిన శిశువును పడేశారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.