News February 21, 2025
రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. తహశీల్దార్ యాదిరెడ్డి రికార్డుల వివరాలను అదనపు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ రికార్డ్ రూమ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం శ్రవణ్, డిప్యూటీ తహశీల్దార్ సంయుక్త, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 22, 2025
నూజివీడు: తల్లి మందలించిందని విద్యార్థి ఆత్మహత్య

నూజివీడు పట్టణ పరిధిలోని బాపునగర్ రోడ్డులో గల పాలిటెక్నిక్ విద్యార్థిని బట్ర వెంకట రమ్య (18) శనివారం ఇంటిలోని దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకొని రమ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాలేజీకి వెళ్లలేదని తల్లి మందలించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.
News February 22, 2025
వెంకోజిపాలెం వైపు ట్రాఫిక్ డైవర్షన్

విశాఖలో ఇసుకతోట జాతీయ రహదారిపై గ్రూప్-2 అభ్యర్థులు శనివారం ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. కొన్ని వాహనాలను వెంకోజిపాలెం మీదుగా ఎంవీపీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు దారి మళ్ళించారు. మరికొన్ని వాహనాలను హెచ్‌బి కాలనీ మీదుగా సీతమ్మధార వైపు దారి మళ్ళించారు.
News February 22, 2025
SRHపై ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్?

IPL టీమ్ SRHపై ఏపీ యువత మండిపడుతోంది. పేరుకే తెలుగు టీమ్ అని, ఒక్క మ్యాచ్ కూడా తమ రాష్ట్రంలో నిర్వహించడం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. HYDలోనే మ్యాచులన్నీ నిర్వహిస్తే AP క్రికెట్ ప్రేమికులు ప్రత్యక్షంగా ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ తెలుగోడు కాబట్టి విశాఖలో 2 మ్యాచులు ఆడిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై SRH ఓనర్ కావ్యా మారన్ ఆలోచించాలని కామెంట్లు చేస్తున్నారు.